పెండింగ్‌ బిల్లులు విడుదల చేయించాలి

సర్పంచుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోగుల ఆంజనేయులు అన్నారు.

Update: 2024-12-15 14:15 GMT

దిశ,తుర్కపల్లి: సర్పంచుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోగుల ఆంజనేయులు అన్నారు .ఆదివారం తుర్కపల్లి మండల కేంద్రంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాన్ని నిధులతో పాటు తమ సొంత నిధులను వెచ్చించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించినట్లు తెలిపారు. పెండింగులో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అమల బాలకృష్ణ, భాస్కర్ నాయక్, మాజీ కో ఆప్షన్ తదితరులు పాల్గొన్నారు.


Similar News