ముగిసిన మద్దిమడుగు అంజన్న బ్రహ్మోత్సవాలు
నల్లమల ప్రాంతంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమడుగు గ్రామంలో ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి.
దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమడుగు గ్రామంలో ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆదివారం జరిగిన అంజన్న ముగింపు బ్రామిస్తావాలకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు,జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ హనుమాన్ గాయత్రి మహా హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కనువిందుగా సీతారాముల కళ్యాణం...
మద్దిమడుగు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ దేశవత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో.. సీతారాముల కళ్యాణ మహోత్సవం కనువిందుగా జరిగింది. అంతకు ముందు శనివారం రాత్రి గరుడవాహన సేవ నిన్న రాత్రి 9:30 ని, హనుమాన్ మహా పడిపూజ కార్యక్రమం హనుమాన్ దీక్ష స్వాముల సమక్షంలో..భక్తిశ్రద్ధతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం ప్రత్యేక పూజలతో పాటు..మన్య సూక్తములతో ఆంజనేయ స్వామి వారికి 108 కలశములచే మహా స్నానం నిర్వహించారు. 41 రోజులు హనుమాన్ మాల ధరించిన భక్తులు మాలవిరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గుర్లపాటి శ్రీనివాసులు, ఉమాహేశ్వర ఆలయ చేర్మెన్ మాధవరెడ్డి, మద్దిమడుగు దేవస్థాన ఈవో రంగాచారి, ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి, జూనియర్ అసిస్టెంట్ పరంధామ రెడ్డి, ఇతర నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారులు, హనుమాన్ మాలాద ధారణ భక్తులు ప్రజలు పాల్గొన్నారు.