Excise Circle CI : నాటు సారా తయారీ కేంద్రాల పై ఉక్కుపాదం..

నాటు సారా తయారు చేసి అమ్మకానికి సహకరించిన వారి పై కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని కల్వకుర్తి డివిజన్ ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

Update: 2024-07-24 16:50 GMT

దిశ, కల్వకుర్తి : నాటు సారా తయారు చేసి అమ్మకానికి సహకరించిన వారి పై కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని కల్వకుర్తి డివిజన్ ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కల్వకుర్తి డివిజన్ లోని నాటుసారా తయారీ స్థావరాలపై ప్రత్యేక నిఘా నిర్వహించమన్నారు. ఇందులో భాగంగా రహదారులపై తనిఖీలు నిర్వహించగా కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ తండా నుంచి బైక్ పై కల్వకుర్తి పట్టణానికి 6 లీటర్ల నాటుసారాయి తరలిస్తున్న ముడావత్ హర్యా పట్టుబడ్డాడని ఆయన తెలిపారు. సారాయి స్వాధీనం చేసుకొని అతని పై కేసు నమోదు చేసి బైక్ ని సీజ్ చేశామని సీఐ వెంకట్ రెడ్డి అన్నారు. అదే క్రమంలో వెల్దండ మండలం 3 తండాల పై దాడులు జరపగా 800 వందల లీటర్ల బెల్లం పానకం, 6 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశామని, ఆగస్టు 31 వ తేది వరకు సారా రహిత తెలంగాణ సాధించాలన్నా లక్ష్య సాధనకు ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారం ఉండాలన్నారు.

Tags:    

Similar News