ఇంకా అక్కడి అధికారులకు సీఎం కేసీఆరే..ఎందుకంటే..?

ఇంకా అక్కడ సీఎం కేసీఆర్ అనే భ్రమలో ఉన్నారు అక్కడి అధికారులు.

Update: 2024-12-18 16:48 GMT

దిశ, జడ్చర్ల : ఇంకా అక్కడ సీఎం కేసీఆర్ అనే భ్రమలో ఉన్నారు అక్కడి అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసి..సంవత్సరం పూర్తి అయినా ఇంకా పాత సీఎం కేసీఆర్ బొమ్మలతోని బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బాలనగర్ తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లే వారికి మన సీఎం కేసీఆర్ అనే ఆలోచన కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయి ధరణి పోర్టల్ కూడా పూర్తిగా ప్రక్షాళన అయింది. కానీ బాలానగర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ధరణి కార్యాలయానికి ఉన్న బోర్డులో ఇంకా మాజీ సీఎం కేసీఆర్ బొమ్మ దర్శనమిస్తుంది. బాలనగర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధరణి పోర్టల్ కార్యాలయానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటోతో బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే నూతన సీఎం ఫోటోతో బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ..నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన కూడా ఇప్పటికీ పాత సీఎం కేసీఆర్ బొమ్మ దర్శనమిస్తుండడంతో ఇక్కడ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పాత సీఎం ఫోటోను తొలగించి..ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో నూతన బోర్డు ఏర్పాటు చేస్తారో లేదో వేచి చూడాలి.


Similar News