గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన

గ్రామ పంచాయతీల కార్మికులు తమ పెండింగ్ జీతాల విడుదల కోసం బుధవారం పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

Update: 2024-12-18 16:56 GMT

దిశ,పెద్దమందడి : గ్రామ పంచాయతీల కార్మికులు తమ పెండింగ్ జీతాల విడుదల కోసం బుధవారం పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆర్ఐ గణేష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ పంచాయతీల కార్మికులకు మూడు నుండి ఐదు నెలల వరకు జీతాలు అందలేదని తెలిపారు. కార్మికుల నేతలు గట్టమ్మ, మజీద్ మాట్లాడుతూ..పని నిర్వహణకు అవసరమైన నిత్యావసర సామగ్రి, సబ్బులు, నూనెలు, ఇనుప సామగ్రి కూడా అందించబడడం లేదని తెలిపారు. ఈ పరిస్థితి పంచాయతీ కార్మికుల జీవనాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో 23 గ్రామ పంచాయతీలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.


Similar News