ప్రమాదకరంగా.. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని తలపునూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రమాదకరంగా మారింది.

Update: 2024-12-18 16:32 GMT

దిశ, రేవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని తలపునూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రమాదకరంగా మారింది. ఈ విద్యుత్ ట్రాన్స్ఫారం మెయిన్ రోడ్డుకు ఉండడంతో..అటువైపు వెళ్లే స్థానికులు, మేత మేయడానికి వెళ్లి వస్తున్న మూగజీవాలు విద్యుత్ ట్రాన్స్ఫారం గుండా వెళ్తూ ఉంటాయి. ఫ్యూజ్‌ బాక్స్‌ వైర్లు చేతికి అందేవిధంగా ఉండడంతో ఏక్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాం దోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీకి నిత్యం స్థానికులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఎదురుగా కనబడుతున్నా కూడా చూసి చూడనట్టుగా పంచాయతీ సెక్రెటరీ,అలాగే విద్యుత్ అధికారులు నిర్లక్ష్య దోరణి వహిస్తున్నారు. ప్రమాదం జరిగే వరకు వాళ్లకు చీమకుట్టినట్టు కూడా అనిపించదని స్థానికులు వాపోతున్నారు. ఎలాగైనా పై అధికారులు చర్య తీసుకొని ఈ విద్యుత్ ట్రాన్స్ఫారం చుట్టూ కంచ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News