సోమశిలకు జాతీయ అవార్డు

పర్యాటక కేంద్రమైన సోమశిలకు జాతీయ అవార్డు దక్కింది.

Update: 2024-09-27 11:23 GMT

దిశ, కొల్లాపూర్ : పర్యాటక కేంద్రమైన సోమశిలకు జాతీయ అవార్డు దక్కింది. స్పిర్చుయల్ అండ్ వెల్నెస్ కేటగిరిలో ఈ అవార్డు అందించారు. అవార్డును భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా పర్యాటక అధికారి కల్వరాల నర్సింహ శుక్రవారం అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డును భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖర్ అందించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రూరల్ విలేజ్ టూరిజంలో భాగంగా 36 గ్రామాలు ఎంపికైయ్యాయి. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల గ్రామంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ది చేశారని, దాంతో నేడు జాతీయ అవార్డు లభించిందని జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ తెలిపారు.   

Tags:    

Similar News