అద్దె చెల్లించలేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
ఒక వైపు తెలంగాణ రాష్ట్రమంతటా,రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే, వనపర్తి జిల్లా అమరచింత లో మాత్రం అధికారులకు చేదు అనుభవం ఎదురైంది.
దిశ, అమరచింత: ఒక వైపు తెలంగాణ రాష్ట్రమంతటా,రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే, వనపర్తి జిల్లా అమరచింత లో మాత్రం అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. సొంత భవనం లేక గత 3 ఏళ్లుగా అద్దె భవనంలో ఎంపీడీఓ, ఎంపీపీ, ఈజీఎస్ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 3 ఏళ్ల అద్దె చెల్లించకపోవడంతో విసుగు చెందిన యజమాని గంగారాం మంగళవారం అధికారులను బయటే ఉంచి, కార్యాలయానికి తాళం వేశారు. ఇలా కార్యాలయానికి తాళం వేయడం ఇది రెండోసారి కావడం విశేషం. ఎవరు నచ్చచెప్పిన భవన యజమాని వినకపోవడంతో ఎంపీడీఓ, ఎంపీఓలు ఆఫీస్ దగ్గరకు రాలేకపోయారు.