చీపురుపట్టి చెత్తను ఊడ్చిన ఎంపీ ఎందుకో తెలుసా..?
మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత వినూతణమైన పథకాలను ప్రవేశపెట్టి.. దేశ ప్రజలందరిని అందులో భాగస్వామ్యం చేశారని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తెలిపారు.
దిశ, గద్వాల : మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత వినూతణమైన పథకాలను ప్రవేశపెట్టి.. దేశ ప్రజలందరిని అందులో భాగస్వామ్యం చేశారని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో ఎంపీ డీకే అరుణ చెత్తను శుభ్రం చేశారు. 2014 అక్టోబర్ 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్‌కు శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమంలో అనేక మంది భాగస్వామ్యం అయ్యి నరేంద్ర మోడీకి బాసటగా నిలిచారన్నారు. స్వచ్ఛ భారత అభియాన్ కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తి కావడంతో.. ప్రధాని మోదీ పిలుపు మేరకు గద్వాలలో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బీజేపీ నాయకులతో డీకే అరుణ కలిసి శ్రమదానం చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ మన చుట్టూ వున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలా భారిన పడకుండా ఉంటామని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా డీకే అరుణ ఆసుపత్రి ప్రాంగణం లో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, నాయకులు శివ రెడ్డి,రామాంజనేయులు, బండల వెంకట్రాములు, కృష్ణ వేణి, పద్మావతి, రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.