వనపర్తి బరిలో పోటీలో ఉంటా.. ఎంపీపీ మెగా రెడ్డి
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుండి తప్పనిసరిగా పోటీలో ఉంటా అని పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి చెప్పారు.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుండి తప్పనిసరిగా పోటీలో ఉంటా అని పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన దిశతో ప్రత్యేకంగా మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో పార్టీ మారాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా నాకు ఖరారు అయ్యింది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ టికెట్టును మాజీ మంత్రి చిన్నారెడ్డికి ఇచ్చారు. ఆయన గెలిచే పరిస్థితిలు లేవన్న విషయము నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని చెప్పారు.
అధిష్టానము నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పూర్తిస్థాయిలో తెలుసుకొని నాకు అవకాశం ఇస్తుంది అన్ననమ్మకంతో ఉన్నాను అని మెగా రెడ్డి పేర్కొన్నారు. పరిస్థితులను గమనించకుండా తనకు అవకాశం కల్పించకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రెబల్ గా పోటీలో ఉంటాను అని మెగా రెడ్డి స్పష్టం చేశారు. మెగా రెడ్డి పోటీలో ఉంటే వనపర్తి నియోజకవర్గంలో రసవత్తర ఎన్నికల పోరు జరగడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.