MLA Vamsi Krishna : అటవీ శాఖ అమరుల త్యాగం వృధా కాదు

ఈ ప్రకృతిని కాపాడే క్రమంలో అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు

Update: 2024-09-11 10:07 GMT

దిశ, అచ్చంపేట : ఈ ప్రకృతిని కాపాడే క్రమంలో అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు కూలిపోయారని వారి త్యాగం వృధా కాదు వారి త్యాగాలను స్మరించుకుంటూ అడవులను వన్యప్రాణులను ప్రకృతిని కాపాడేందుకు మరింత కంకణబద్ధులై అటవీ శాఖ పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బుధవారం జాతీయ అటవీశాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో అమరులను తలుచుకుంటూ అటవీ శాఖ అధికారులు సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలైనా అర్పిద్దాం అడవులను కాపాడుదాం, జోహార్ అటవీశాఖ అమర వీరులారా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ అమరవీరుల స్థూపం వద్ద అటవీశాఖ అధికారులు సిబ్బంది వాళ్లు అర్పించారు.

చెట్టును కాపాడితే భూలోకాన్ని కాపాడినట్టేనా..

ప్రపంచం వ్యాప్తంగా 33 శాతం అడవులు ఉండాలని, గతంతో పోల్చుకుంటే నల్లమల అడవులు మరింత అభివృద్ధి చెందాయని, అందుకు అధికారులు సిబ్బంది కృతనిచ్చేంతో పనిచేస్తున్నందుకే కుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉన్నదని గా పులుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని, చెట్టును కాపాడితే భూలోకాన్ని కాపాడినట్లే దీనిని అర్థం చేసుకొని అటవీ శాఖ అధికారులు మరింత సమన్వయంతో తమ విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.

త్వరలో నల్లమల లో మంత్రి కొండా సురేఖ పర్యటన..

నల్లమల అడవులు గుర్తుండి పోయేలా పెద్దపురుల సంఖ్య పెంచేలా అందరి కృషి అవసరమని, టైగర్ కు అత్యధిక ప్రాధాన్యత ఎక్కడ ఉన్నదంటే దేశంలోనే అమ్రాబాద్ గుర్తుండాలని, ఇక్కడి ప్రకృతి అందాలు ప్రపంచానికి చూపే విధంగా టూరిజం అభివృద్ధి చెందాలని, తెలంగాణ రాష్ట్రానికి నల్లమల అటవీ ప్రాంతం ఊటీ లాంటిదని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందన్నారు. అడవుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక అటవీశాఖ తో రివ్యూ సమావేశం, అభివృద్ధి చర్యల కోసం త్వరలోనే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటన నల్లములలో ఉంటుందని గుర్తు చేశారు.

అత్యుత్తమ టైగర్ రిజర్వ్ ప్రాంతంగా కావాలి...

నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ఏర్పాటు అనంతరం గత కొద్ది సంవత్సరాలుగా పెద్దపురుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి అన్నారు. అమరుల ప్రాణ త్యాగాలు వృధా కావద్దని, ప్రస్తుతం ఈ అడవుల్లో 34 అది గత రెండు రోజుల క్రితం ఎన్ టి సి ఏ వారు నివేదిక వెల్లడించారని గుర్తు చేశారు. ఉన్న సిబ్బంది చాలా నిబద్ధతతో పని చేస్తున్నారని, అడవులు వన్యప్రాణుల సంరక్షణ పెరిగిందని, సమీప గ్రామాల ప్రజలను అడవులను రక్షించే విషయంలో మరింత చైతన్యం పరిచి పర్యావరణ అభివృద్ధికి పాటుపడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, అచ్చంపేట అమ్రాబాద్ డివిజన్ అధికారులు, సెక్షన్, బీట్ ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News