ధాన్యం ఆరబోత..రోడ్డు బ్లాక్ చేసిన రైతులు
పర్యాటక ప్రాంతంగా,ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఎంతో ప్రాచుర్యం పొందుతున్న కొల్లాపూర్ మండలం సోమశిల పుణ్యక్షేత్రంలో( Somashila Shrine )రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు.
దిశ, కొల్లాపూర్: పర్యాటక ప్రాంతంగా,ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఎంతో ప్రాచుర్యం పొందుతున్న కొల్లాపూర్ మండలం సోమశిల పుణ్యక్షేత్రంలో( Somashila Shrine )రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు.మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేసి రాత్రిళ్లు అక్కడే ఉంచుతున్నారు. దీంతో పర్యాటకులకు, వాహనాదారులకు ప్రాణ సంకటంగా మారింది. బైపాస్ రోడ్డుమీద వాహనాలు పోకుండా రైతులు మొక్కజొన్న పంటను ఆరబోయడంతో..గ్రామంలో ప్రధాన రహదారి పై నుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి. గ్రామంలో ప్రధాన రహదారిని సిసి రోడ్డు నిర్మించడంతో..అడుగడుగున నల్లా కనెక్షన్ల కోసం సిసి రోడ్డును ధ్వంసం చేశారు.దీంతో రోడ్డు ను పగులగొట్టిన ఆ ప్రదేశాల్లో గుంతలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా అర పీటు ఎత్తున నడి రోడ్డుపై పలు చోట్ల స్పీడ్ బ్రేక్ లు ఏర్పాటు చేశారు.ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలలో నిత్యం పర్యాటకులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే సోమశిల గ్రామం వెలుపల నుంచే బైపాస్ రోడ్డు ద్వారా నేరుగా విఐపి పుష్కర్ ఘాట్, ఏ కోటూరిజం నిర్మించిన కాటేజీలకు పర్యాటకులు వస్తూ వెళ్తుంటారు. అయితే రైతులు ఈ బైపాస్ రోడ్డుపై ముళ్లకంప, రాళ్లు అడ్డంపెట్టి రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో పర్యాటకులకు ప్రాణ సంకటంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి సోమశిల పర్యాటక కేంద్రానికి వచ్చే టూరిస్టులకు రోడ్డు బ్లాక్ చేయడంతో..వాహనాదారులుు ఇబ్బందులకు పడుతున్నారు. గతంలో ఇదే బైపాస్ రోడ్డుపై మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబోయడంతో.. బైక్ పై ప్రయాణం చేసిన యువకులు పలు మార్లు ప్రమాదాల గురై క్షగాత్రులు కాగా కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. గతంలో ఎస్సై సత్యనారాయణ రెడ్డి బైపాస్ రోడ్డుపై ధాన్యం ఆరబోయకుండా చర్యలు తీసుకున్న విషయం విధితమే. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు,గ్రామపంచాయతీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదని పర్యాటకులు ,పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని బైపాస్ రోడ్డుపై ధాన్యం ఆరబోయకుండా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.