దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్టెం..
మక్తల్ పట్టణం కేంద్రంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
దిశ, మక్తల్: మక్తల్ పట్టణం కేంద్రంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరూ కూడా ఇబ్బందులు పడొద్దని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
రైతులు అధిక ధరలు ఇప్పిస్తామని మధ్య దళారుల మాటలు విని మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చి తూకాలు వేయించాలని, అధికారులకు రైతులు బ్యాంకు ఖాతా నెంబర్ ఇస్తే నేరుగా ఖాతాకు డబ్బులు బదిలీ చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.