MLA Chikkudu Vamsi Krishna విద్యుత్ లో వోల్టేజ్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను పూర్తిగా

Update: 2024-08-14 11:12 GMT

దిశ, అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను పూర్తిగా అధిగమించేలా ఈ ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ముందుకు వెళుతుందని ఆ క్రమంలోనే నూతనంగా నియోజకవర్గానికి ఆరు సబ్ సెంటర్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే  చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని 32 వేల కోట్ల అభివృద్ధి పనులకు కుదుర్చుకొని విదేశీ కంపెనీలకు పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయన్నారు. తెలంగాణ ఏ పునాదుల మీద అయితే ఏర్పడిందో గత ప్రభుత్వం వాటిని విస్మరించిందని నల్లమల్ల ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు నిధులు నియామకాల సమకూర్చడంలో భాగంగానే దూరద దృష్టితో ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టిందని ఈ క్రమంలోనే అచ్చంపేట నియోజకవర్గం మొదటి ఫేసులో ఉమామహేశ్వర లెఫ్ట్ ఇరిగేషన్ రెండవ ఫేసులో చెన్నకేశవలిప్ ఇరిగేషన్ పనులు ప్రారంభించేందుకు త్వరలో అచ్చంపేటకు రానున్నారని గుర్తు చేశారు.

ఆరు నూతన సబ్స్టేషన్లో మంజూరు..

జూలై 16 తారీఖున డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క నల్లమల్ల పర్యటన సందర్భంగా నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరడం తో డిప్యూటీ సీఎం లోని లింగాల మండలం బాకారం గ్రామం ఉప్పునుంతల మండలం కంసాన్పల్లి అచ్చంపేట మండలం సింగారం పదర మండల కేంద్రం పిల్లల వంగూరు మండలం ఫుల్పర గ్రామాలకు విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని వీటితోపాటు అమ్రాబాద్ మండలం లో 220 బై 33 కెవి సబ్ స్టేషన్ మల్కమామిడి లేదా మాచారం గ్రామాల మధ్యన ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులకు స్థలాలు కేటాయించాలని ఆదేశించామన్నారు అలాగే అమ్రాబాద్ మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ కూడా అనుమతులు మంజూరయ్యాయని డిప్యూటీ సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం త్వరలో జరగనుందని సూచించారు. అలాగే 181 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయని వాటిని లబ్ధిదారులకు వచ్చే సోమవారం అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో నరసయ్య యాదవ్, వెంకట్ రెడ్డి, రాజు, నరసింహ తదితరులు ఉన్నారు.


Similar News