మొరాయించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎస్కార్ట్ వాహనం..
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎస్కార్ట్ వాహనం ఒకటి మొరాయించింది.
దిశ, జడ్చర్ల: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎస్కార్ట్ వాహనం ఒకటి మొరాయించింది. బుధవారం జడ్చర్లలో ఓ ప్రైవేట్ వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్లే క్రమంలో మంత్రికి రక్షణగా ఉండవలసిన వాహనం ఒక్కసారిగా మొరాయించింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఆ వాహనం కదలకపోవడంతో సిబ్బంది దానిని తోసి స్టార్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రయోజనం లేకపోవడంతో మంత్రి మిగతా కార్యక్రమాలలో పాల్గొనేందుకు బయలుదేరారు. సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి మెకానిక్ ను రప్పించి రిపేరింగ్ చేసే పనులలో పడ్డారు. ఫిట్ నెస్ చేయించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
Also Read..
అందమైన బ్రోచర్లతో ‘ఐ’ మార్క్ మాయజాలం.. ఆ మంత్రి ఫుల్ సపోర్ట్ అంటూ జోరుగా ప్రచారం!