medicinal garden : కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు..
స్కూల్ ఎర్త్ క్లబ్ - యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్ లో (YELP) భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (CGR) పర్యావరణ సంస్థ వారు హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాలకి ఔషధ మొక్కలను ఇచ్చి పాఠశాల ప్రాంగణంలో మెడిసినల్ గార్డెన్ తయారు చేశారు.
దిశ, హన్వాడ : స్కూల్ ఎర్త్ క్లబ్ - యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్ లో (YELP) భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (CGR) పర్యావరణ సంస్థ వారు హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాలకి ఔషధ మొక్కలను ఇచ్చి పాఠశాల ప్రాంగణంలో మెడిసినల్ గార్డెన్ తయారు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సభ్యులు విద్యార్థులకు పరిపూర్ణమైన ఆరోగ్యానికి, జ్ఞాపక శక్తి సామర్థ్యం మెరుగుదలకు ఉపయోగపడే ఔషధ మొక్కల ప్రాధాన్యత గురించి ప్రోగ్రాం ఆఫీసర్ విశ్వేశ్వరరావు విద్యార్థులకు వివరించారు.
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఈ సంస్థ ప్రధానంగా విస్తృతమైన చెట్ల పెంపకం, పర్యావరణ విద్య, ప్రకృతి పరిరక్షణ, భూమి నాయకత్వం, వాతావరణ చర్య, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, పర్యావరణ పాలన వంటి కార్యక్రమాలను చేపడుతుందని వారు అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు మొక్కల రక్షణ, మొక్కలు పెంచే విధానం పై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.పద్మావతి, ఉపాధ్యాయ బృందం, ఎర్త్ క్లబ్ మెంటర్,CGR ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొత్తపల్లి రవి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.