కందనూలు కేసరి సముద్రంలో వ్యక్తి గల్లంతు..
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేదారి సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతైనట్లు స్థానికుల ద్వారా తెలిసింది.
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేదారి సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతైనట్లు స్థానికుల ద్వారా తెలిసింది. మంగళవారం ఈ మేరకు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అధికారులు అక్కడికి చేరుకొని మూడు గంటలుగా అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆనవాళ్ళు లభించలేదని ఫైర్ సిబ్బంది అధికారులు తెలిపారు. ఆ యువకుడు ఎవరు..?ఎందుకోసం వచ్చాడు.? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.