తిరుమలలో సమాన దర్శన భాగ్యం కలిగించండి

తిరుమలలో స్వామి వారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుంటామని తెలపడాన్ని స్వాగతిస్తున్నానని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Update: 2024-12-28 11:42 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: తిరుమలలో స్వామి వారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుంటామని తెలపడాన్ని స్వాగతిస్తున్నానని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాలు కలిసి ఉన్నామని,రాష్ట్రం విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ దేవాలయాలకు వచ్చే సందర్శకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్త..ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామన్నారు. అలాంటిది తిరుమలలో శ్రీవారి దర్శన విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలు సిఫార్సు విషయంలో వారానికి రెండు సార్లే దర్శన అనుమతి ఇవ్వాలనే టిటీడీ నిర్ణయం సరికాదన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,టిటిడి బోర్డు పునరాలోచించి రెండు రాష్ట్రాలకు సమాన దర్శనం అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Similar News