జడ్చర్లలో ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ నరసింహ
జడ్చర్ల ఎన్నికల సెంటర్ ను మహబూబ్ నగర్ ఎస్పీ నరసింహ పరిశీలించారు.
దిశ, జడ్చర్ల : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జడ్చర్ల పట్టణంలో సజావుగా కొనసాగుతోంది. ఉదయం నుండి ఓట్లు వేయడానికి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఓటింగ్ కేంద్రం వద్ద తీరారు. కాగా జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ డిగ్రీ కళాశాలలో ఉన్న ఓటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నరసింహ పర్యవేక్షించారు. ఓటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించి ఓటింగ్ వేయడానికి వచ్చిన ఉపాధ్యాయుల వద్ద ఐడి కార్డులను ఎస్పీ పరిశీలించారు. ఓటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అమాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పర్యవేక్షించాలని స్థానిక పోలీస్ అధికారులకు సూచించారు.
ఓటింగ్ వేయడానికి వచ్చిన ఉపాధ్యాయులకు తగిన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎన్నికల నియమావళిని ఉల్లగించకుండా ఓటింగ్ సజావుగా సాగేలా నిఘా ఉంచాలని ఆదేశించారు. కాగా జడ్చర్ల పట్టణంలో 431 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎస్పీ వెంట పట్టణ సీఐ రమేష్ బాబు రూరల్ సీఐ జములప్ప తాసిల్దార్ లక్ష్మీనారాయణ సిబ్బంది తదితరులు ఉన్నారు.