Mahabubnagar Collector : సీజనల్ వ్యాధుల పట్ల తక్షణమే చికిత్స నిర్వహించండి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ,జ్వరం

Update: 2024-08-14 16:35 GMT

దిశప్రతినిధి,మహబూబ్ నగర్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ,జ్వరం,డెంగ్యూ వంటి కేసులకు తక్షణ వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని బుధవారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఫీవర్ సర్వే సందర్భంగా నమోదైన జ్వర కేసులు,జూలై లో నమోదైన జ్వర,డెంగ్యూ,తదితర కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలోని క్యాజువాలిటీ,ఐసీయూ,మెడికల్ ఓపి తదితర వార్డులను ఆమె తనిఖీ చేశారు.ఆసుపత్రి సూపరెండెంట్ సంపత్ కుమార్ ద్వారా ఫీవర్,డెంగ్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విభాగాల అధిపతులతో ఆసుపత్రికి అవసరమైన మందులు,ఇతర మెడికల్ సామాగ్రి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై ఆసుపత్రి డాక్టర్లు,సిబ్బంది దృష్టిసారించాలని ఆమె సూచించారు.ఈ తనిఖీ లో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జరీనా తదితర సిబ్బంది పాల్గొన్నారు.


Similar News