ఏవీఎన్ రెడ్డిని గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం
గత అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యల వల్ల ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని... Latest News
దిశ, మరికల్: గత అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యల వల్ల ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేర్ కృష్ణారెడ్డి, నరసింహ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మరికల్ మండల పరిధిలోని పెద్దచింతకుంట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డిని బలపరిచిందని తెలిపారు.
దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రభుత్వ లెక్చరర్ గా సేవలు అందించి విద్యారంగంపై సుదీర్ఘమైన అనుభవం కలిగిన ఏవీఎన్ రెడ్డిని గెలిపించడం వల్ల ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి సారిస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్య వ్యవస్థలో సమూల మార్పులు నాణ్యమైన విద్య కోసం, సామాజిక సేవకై అంకితమైన ఏవీఎన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు సురేష్, జ్ఞానేశ్వర్, కవిత, రాఘవేంద్ర, ఉపాధ్యాయులు సంజీవ్, ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.