Juraala Project: జూరాల ప్రాజెక్ట్ గేట్లు మూసివేత..

జూరాల ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో బుధవారం రాత్రి 9 గంటలకు 55,800 క్యూసెక్కులకు తగ్గినట్లుగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

Update: 2024-10-03 02:57 GMT

దిశ, గద్వాల టౌన్: జూరాల ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో బుధవారం రాత్రి 9 గంటలకు 55,800 క్యూసెక్కులకు తగ్గినట్లుగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ గేట్లను గురువారం ఉదయం మూసివేసినట్లుగా పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 41,039 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తున్నామని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 9,657 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 9,418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు.


Similar News