పురుగులతోనే జ్యూస్.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అమ్మకందారులు..
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న జ్యూస్ బండ్లల్లో పురుగులు పడిన అలాగే అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న జ్యూస్ బండ్లల్లో పురుగులు పడిన అలాగే అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన జ్యూస్ బండిలో రంగురంగుల విద్యుత్ బల్బులు పెట్టడంతో వాటి కోసం వచ్చిన పురుగులు జ్యూస్ లో పడి ఉండడాన్ని వినియోగదారుడు గమనించి పురుగులు పడ్డాయి కదా అని ప్రశ్నించగా, సునాయాసంగా తీసుకొని చేత్తో పురుగులు తీసి మళ్లీ ప్రజలకు అదే పంపిణీ చేస్తూ తన కక్కుర్తిని ప్రదర్శించాడు.
ఇది కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జ్యూస్ తయారీలోనూ నిర్వాహకులు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలే వేసవి కాలం కావడంతో వినియోగదారులు నాసిరకమైన ఐస్ క్రీం జ్యూస్ లను పంపిణీ చేసిన లొట్టలు వేసుకుంటూ అదేపనిగా సేవిస్తున్నారు చివరికి అనారోగ్యం పాలవుతున్నారు.