మూడేళ్ల పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాదులోని దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో 2024-2025 విద్యా సంవత్సరానికి మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన

Update: 2024-04-23 11:31 GMT

దిశ, గద్వాల్ కలెక్టరేట్ : హైదరాబాదులోని దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో 2024-2025 విద్యా సంవత్సరానికి మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ (డీసీఈ), డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (డీఈఈఈ), డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ (డీ సీఎంఈ), డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (డీఈసీఈ) కోర్సులలో 60 సీట్లు చొప్పున విద్యార్థినీలకు కేటాయించడం జరుగుతుందన్నారు.

తల్లిదండ్రులు కోల్పోయిన, తల్లి లేదా తండ్రి చనిపోయిన, అనాథ బాలికలతో పాటు నిరుపేద విద్యార్థినీలు, అక్రమ రవాణా బాధిత బాలికలు తమ విద్యార్హతలతో కూడిన ధ్రువపత్రాలను దరఖాస్తుకు జతపరచాల్సి ఉంటుందన్నారు. వీరు పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. దివ్యాంగులకు మూడు శాతం సీట్లు కేటాయిస్తారన్నారు. అనాథ బాలికలకు కులము, ఆదాయ ధ్రువపత్రాలు అవసరం లేదన్నారు. పేరెంట్స్ మరణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. గద్వాలలోని రెండవ రైల్వే గేట్ శివాలయం రహదారిలో ఉన్న బాల రక్షా భవన్ లో దరఖాస్తు ఫారాలు లభిస్తాయని తెలిపారు. దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత చేసి మే 2వ తేదీ లోగా కార్యాలయంలో సమర్పించాలని ఆమె వివరించారు. ఎంపికైన విద్యార్థినిలకు మూడేళ్ల పాటు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారన్నారు.


Similar News