పునరావాసం కోసం బాచారం అడవిలో జిల్లా అటవీ అధికారుల పరిశీలన

దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ( Tiger Reserve Forest ) అయిన అమ్రాబాద్ అభయారణ్యం లో నివసిస్తున్న గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నాగర్ కర్నూల్ ( Forest Officer ) జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి వెల్లడించారు.

Update: 2024-10-29 09:22 GMT

 దిశ,కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ( Tiger Reserve Forest ) అయిన అమ్రాబాద్ అభయారణ్యం లో నివసిస్తున్న గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నాగర్ కర్నూల్ ( Forest Officer ) జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి వెల్లడించారు. జిల్లాలోని నల్లమల అప్పర్ ప్లాట్ లో నివసిస్తున్న సార్ల పల్లి, కుడిచింతల బైలు, తాటి గుండాల, కొల్లం పెంట గ్రామాలను మొదటి విడతలో పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలోని ఫారెస్ట్ లో

( Forest ) పునరావాసం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. అమ్రాబాద్, అచ్చంపేట ఎఫ్ డి ఓ ( FDO ) లు రామ్మూర్తి, తిరుమల రావు, నాలుగు గ్రామాల పునరావాస కమిటీ ప్రతినిధులతో కలిసి డీఎఫ్ఓ రోహిత్ గోపిడి మంగళవారం బాచారం అడివిలో పునరావాస ప్రాంతాన్ని పరిశీలించారు. వారంతా కలిసి బాచారం అటవీ సరిహద్దు ప్రాంతాన్ని ఎత్తయిన కొండను ఎక్కి పునరావాస అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు చూపారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి మాట్లాడుతూ… అమ్రాబాద్ టైగర్ ( Amrabad Tiger ) అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం నల్లమల లోని నాలుగు గ్రామాలను మొదటి విడతలో బాచారం అటవీ ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. ఇందుకు నల్లమల అప్పర్ ప్లాట్ గ్రామాల ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ కి స్వచ్ఛందంగా అంగీకరించడంతో వారికి పునరావాసం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఒక కుటుంబానికి రూ. 15 లక్షలు, 250 గజాలు నివేశన స్థలం, ఐదు ఎకరాలు సాగు కోసం భూమి ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. రెండో విడతలో వటవర్లపల్లి గ్రామాన్ని బాచారం ప్రాంతానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే బాచారం అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా సర్వే చేసి, అందుకు సంబంధించిన రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, ఈ అటవీ భూమిని రెవెన్యూ శాఖకు మార్పిడి చేసిన తర్వాత బాచారం అటవీ ప్రాంతంలో పునరావాస కేంద్రంలో వివిధ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు డి ఎఫ్ ఓ రోహిత్ గోపిడి వెల్లడించారు. అయితే మొదటి, రెండు విడతల్లో కలిసి మొత్తం 1167 కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పునరావసపనులను రెండు మూడు నెలల్లో చేపట్టనున్నట్లు ఎఫ్డిఓ చెప్పారు. వీరి వెంట కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్, డిప్యూటీ రేంజర్ వాణి, సెక్షన్ ఆఫీసర్లు ధర్మ, రామాంజనేయులు, ప్రశాంత్ రెడ్డి, బీట్ ఆఫీసర్లు బేస్ క్యాంపు సిబ్బంది, అప్పుల అపర్ ప్లాట్ పునరావాస గ్రామాల అభివృద్ధి కమిటీ చైర్మన్ సాయిబాబు ఉన్నారు.


Similar News