ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఓల్డు తహశీల్దార్ గెస్ట్ హౌస్ లో సోమవారం ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ డాక్టర్.వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఓల్డు తహశీల్దార్ గెస్ట్ హౌస్ లో సోమవారం ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ డాక్టర్.వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ శక్తి క్యాంటీన్లను మహిళలతో సెక్రటేరియట్లో ప్రారంభించగా, రెండవది మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభించారన్నారు. మహిళా సాధికారతను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దాదాపు ఆరు లక్షల రూపాయలతో మహిళా సంఘాలకు ఐకేపీ ద్వారా సహాయ సహకారాలు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
క్యాంటీన్లతో సరిపెట్టుకోకుండా మహిళలు కార్పొరేట్, కాస్మెటిక్స్ ఎంటర్ప్రైజెస్, అన్ని రంగాల్లో మహిళలు చొరవ చూపాలని జిల్లా కలెక్టర సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం దగ్గరలో ఉన్నందుకే వారికి ఈ స్థలంలో క్యాంటీన్ పెట్టుకోవాలని సూచించామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. డీఆర్డీఏ అధికారి మొగులప్ప, ఎంపీడీవో రమేష్ తహశీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, గణేష్ కుమార్, వెంకటేష్, ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.