దేశ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం : ఎంపీ డీకే అరుణ

విదేశాల్లో భారదేశ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా

Update: 2024-09-11 14:42 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: విదేశాల్లో భారదేశ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు,పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.భారతదేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు రాహుల్ గాంధీ అండగా నిలుస్తూ,దేశంలో ఉంటూ,అర్థంలేని విమర్శలు చేస్తూ కూడా,భారతదేశంలో మాట్లాడటానికి స్వేచ్ఛ లేదని ఆరోపించడం సిగ్గుచేటని,ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం రాహుల్ గాంధీ కి,కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయిందని ఆమె ధ్వజమెత్తారు.అంతేకాక జమ్ము కాశ్మీర్ లో దేశ వ్యతిరేక విధానాలకు మద్దతిస్తూ,ఈ దేశాన్ని విఛ్ఛిన్నం చేసేలా ప్రయత్నిస్తున్నారని,రాహుల్ గాంధీ ప్రతిసారీ మన దేశ భద్రతను,రక్షణ రంగాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఆయనకు అలవాటైందని ఆరోపించారు.ఆయన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని,బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.


Similar News