గండీడ్ తహసీల్దార్ పై హైకోర్టు సీరియస్..!

మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె చెన్నారెడ్డి, లావణ్య వారి కుటుంబంతో కలిసి మూడెకరాల ఎనిమిది గుంటల పట్టా భూమిని వారసత్వంగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

Update: 2024-07-04 03:42 GMT

దిశ, మహమ్మదాబాద్/గండీడ్: మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె చెన్నారెడ్డి, లావణ్య వారి కుటుంబంతో కలిసి మూడెకరాల ఎనిమిది గుంటల పట్టా భూమిని వారసత్వంగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న, పల్లె మహిపాల్ రెడ్డి, పల్లె జనార్దన్ రెడ్డి, పల్లె చెన్నారెడ్డి, పల్లె మసిరెడ్డి, పల్లె రాంరెడ్డి, అనే వ్యక్తులు తహసీల్దార్‌తో కుమ్మక్కయి ఇట్టి పట్టా భూమిలోంచి వాళ్ళని తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా వీరు మిగిలిన గ్రామస్తులందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఇట్టి పట్టాదారులను భూమి విషయమై తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 80 ఏళ్లకు పైగా వయసు కలిగిన పట్టాదారు తల్లిదండ్రులు పల్లె కృష్ణారెడ్డి, సరోజన‌ను సైతం వేధింపులకు గురి చేశారు. దీనిపై బాధితులైన పట్టాదారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తహసీల్దార్ జారీ చేసిన ఆదేశాలపై సీరియస్ అయింది. అధికారం లేకుండా ఇలాంటి తప్పుడు ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలపై సస్పెన్షన్ విధించింది.


Similar News