నాగర్ కర్నూల్ జిల్లాలో దంచి కొట్టిన వానలు.. పొంగి పొర్లుతున్న దుందుభి వాగు

గడిచిన 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా వర్షాలు దంచికొడుతున్నాయి.

Update: 2024-09-01 05:15 GMT

దిశ, అచ్చంపేట : గడిచిన 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండి మత్తడి దుక్కుతున్నాయి. ఈ క్రమంలో అమ్రాబాద్ మండల కేంద్రంలో అత్యధిక వర్షపాతం 142.8 మిల్లీమీటర్లు నమోదు కాగా అత్యల్పంగా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అయితే అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్, పదర,బల్మూరు మండలాలను ఆరెంజ్ అలెర్ట్ ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. కాగా గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అమ్రాబాద్ మండలం 142.8 మిల్లీ మీటర్లు, ఐనులు గ్రామంలో 134. 0 మిల్లీమీటర్లు, పదర మండల కేంద్రంలో 121.5 మిల్లీమీటర్లు, అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో 120.3 మిల్లీమీటర్లు, బల్మూరు మండల కేంద్రంలో 117.0 మిల్లీమీటర్లు, లింగాల మండలంలో 50 మిల్లీమీటర్లు, అచ్చంపేట మండల కేంద్రంలో 43.3 మిల్లీమీటర్లు, ఉప్పునుంతల మండల కేంద్రంలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కాగా అచ్చంపేటలో 33/11 కేవీ సబ్ స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న దుందుభి..

గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉప్పునుంతల మండలం ఉల్పర, వంగూరు మండలం మొల్గర గ్రామాల మధ్య ఉన్న ప్రమాద స్థాయిలో దుందిబి నది ప్రవహిస్తుంది. తద్వారా ఉప్పునుంతల వంగూరు మండలాలకు పూర్తిగా రాకపోకలు రద్దు అయ్యాయి. దుందుభి నది ఉల్పరా వద్ద ఏర్పాటు చేసిన భారీ కేట్స్‌ను సైతం వరద ముంచి వేయడంతో అటువైపు ఎవ్వరు కూడా వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని కుంటలు చెరువులు, వాగులు, వంకలు పొంగి పొందుతున్నాయి. చంద్ర సాగర్ డ్యామ్ పూర్తి స్థాయిలో నిండింది. అలాగే అమ్రాబాద్ మండలంలో నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మన్ననూరు గ్రామంలో ఉన్న దుర్వాసన చెరువుకు పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరుతుంది. అలాగే చింతలచెరువు లోకేశ్వరం చెరువు పెద్ద చెరువు తదితర చెరువులు బర్తడి దుంకుతున్నాయి.


Similar News