ఒంటరిగా వస్తాడు.. నిమిషాల్లో చోరీ..

నేరస్థుడంటే ఆషామాషి నేరస్థుడు కాదు..జైలు జీవితం అనుభవించి తిరిగి చోరీలకు అలవాటు పడ్డాడు.

Update: 2024-12-28 10:56 GMT

దిశ, నారాయణపేట క్రైమ్: నేరస్థుడంటే ఆషామాషి నేరస్థుడు కాదు..జైలు జీవితం అనుభవించి తిరిగి చోరీలకు అలవాటు పడ్డాడు. ఒకే రోజు రాత్రికి రాత్రే నాలుగైదు దొంగతనాలు చేయడం ఆ నిందితుడి ప్రత్యేకత. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలానికి చెందిన చాపలి భాస్కర్ పాత నేరస్తుడు. గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో మక్తల్, ఊట్కూరు,మద్దూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు.2018 ఆగస్టు 10న పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకొని కొంతకాలం బెంగళూరు..హైదరాబాద్ లో ఉంటూ కూలీ పని చేశాడు. గత రెండు సంవత్సరాల క్రితం నారాయణపేట మరికల్, మక్తల్,కొడంగల్,బొంరాస్ పేట,పరిగి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో శనివారం ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదని తిరిగి మరికల్ లో దొంగతనం చేసేందుకు యత్నించగా పోలీసులకు చిక్కినట్లు డిఎస్పి తెలిపారు. సుమారు నారాయణపేట్, మరికల్, మక్తల్, కోస్గి పోలీస్ స్టేషన్లో పరిధిలో సుమారు 13 కేసుల్లో చాపలి భాస్కర్ నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.19 లక్షల విలువ చేసే బంగారం,రూ.1 లక్ష 50 విలువ చేసే వెండి రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు. కేసు చేదించడంలో కీలకంగా వ్యవహరించిన మరికల్ సీఐ కే రాజేందర్ రెడ్డి, నారాయణపేట సీఐ శివశంకర్, మరికల్ ఎస్సై రాములు, నారాయణపేట ఎస్సై వెంకటేశ్వర్లు, అలాగే నారాయణపేట, మరికల్ క్రైమ్ పార్టీ పోలీస్ సిబ్బంది పీసీ రవీందర్ నాథ్, పీసీ తిరుపతిరెడ్డి, పీసీ 2677 లింగమూర్తి, పీసీ 1036 ఆంజనేయులు, పీసీ 1014 రాములను డిఎస్పీ అభినందించి రివార్డు అందించారు.


Similar News