పార్టీ ఏదైన మనవాడే గెలవాలి.. అప్పుడే రాజ్యాధికారాన్ని సాధిస్తాం: MLA ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాలు వేరైనా.. పార్టీలు వేరైనా ఎన్నికలు ఏవైనా మనమంత ఒక తాటిపై ఉండి మనవాడినే గెలిపించుకోవాలని గుంతకల్ ఎమ్మెల్యే జయరాములు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిలు అన్నారు.

Update: 2024-07-16 04:18 GMT

దిశ, అలంపూర్‌: రాజకీయాలు వేరైనా.. పార్టీలు వేరైనా ఎన్నికలు ఏవైనా మనమంత ఒక తాటిపై ఉండి మనవాడినే గెలిపించుకోవాలని గుంతకల్ ఎమ్మెల్యే జయరాములు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిలు అన్నారు. వైసీపీ కర్నూలు ఎమ్మెల్సీ మధుసూదన్ నాయుడు, ఏపీ రాష్ట్ర టీడీపీ మహిళా కార్యనిర్వాహకురాలు గుడిసె కిష్టమ్మలతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని అల్లంపూర్ చౌరస్తాలో రాష్ట్ర అధ్యక్షుడు నీలి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వాల్మీకి ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆయా నియోజకవర్గాల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను గజమాలతో స్వాగతించి సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ.. నా ఏపీ రాష్ట్రంలో రెండుసార్లు వైకాపా నుండి మూడవసారి టీడీపీ ఎమ్మెల్యేగా వాల్మీకులంతా ఏకతాటిపై కొచ్చి నన్ను గెలిపించారని గుమ్మనూరు జయరాములు అన్నారు.

వాల్మీకి సమాజం తమ హక్కుల కోసం పోరాడుతుందని అన్నారు. ఏపీలోని రాజకీయ పార్టీలు వాల్మీకులను నమ్ముకొని టికెట్లు ఇచ్చి గౌరవిస్తున్నాయని అదే నమ్మకంతో వాల్మీకులంతా ఏకమై మనోడినే గెలిపించుకోవాలన్నారు. కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలని వాల్మీకుల ఓట్లతో గద్దనెక్కుతూ వాల్మీకులను విస్మరిస్తున్నాయని విమర్శించారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో సుమారు 6 లక్షల ఓట్లు ఉన్న వాల్మీకులకు టికెట్లు ఇవ్వడం లేదని రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కుతున్నారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో గద్వాల చక్రం తిప్పే నాయకుడిగా నీలి శ్రీనివాసులు చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. అనంతరం ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వాల్మీకులు అనగా పడుతున్నారని వాల్మీకుల హక్కుల కోసం తాను ఎన్నికల ప్రచారంలో మోడీ సభలో ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.

ఉత్తర భారత దేశంలో వాల్మీకి సమాజానికి చెందిన వారంతా ఎస్టీలుగా ఉన్నారని కానీ ఏపీ తెలంగాణలో వాల్మీకులు ఎందుకు బీసీలుగా అనగా పడుతున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెప్పారు. కచ్చితంగా వాల్మీకులకు న్యాయం చేస్తానని స్వయంగా ప్రధానమంత్రి మోడీగారి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాల్మీకి నాయకులు అన్ని పార్టీలలో ఉండాలని అన్ని ఎన్నికలలో పోటీ చేయాలని టికెట్టు రాకపోయినా ఇండిపెండెంట్గా నిలబడి ప్రజలను చైతన్యపరిచి విజయం సాధించాలని అన్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వాడు ఎవరి నిలబడిన బోయలంతా ఐక్యతతో ఉండి ఓటు వేయాలని అన్నారు.

రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వకపోతే ధైర్యంగా ముందుకు వచ్చి మా వాడికి టికెట్ ఇస్తేనే మీ పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లంపూర్ నియోజకవర్గం లో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో వాల్మీకులు పోటీ చేయాలని వారి విజయం కోసం అవసరమైతే నేను కూడా వచ్చి ప్రచారం చేస్తానని అన్నారు. తాను వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీ అయిన వాల్మీకులనంతా ఏకతాటిపైకి తీసుకువచ్చే దాన్లో భాగంగా ఈ సభలో పాల్గొంటున్నానని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ నాయుడు అన్నారు.

మేమంతా రాజకీయాలు వేరైనా పార్టీలు వేరైనా వాల్మీకుల కోసం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నామని ఇదే స్ఫూర్తితో తెలంగాణలో వాల్మీకులు ఐక్యతతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య వాల్మీకి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాయతూరు మద్దిలేటి, మాజీ చైర్మన్ (ADCC BANK) వీరాంజనేయులు, రామానాయుడు బైరాపురం రమణ, మేడికొండ మాజీ సర్పంచ్ వెంకటేష్, ధనుంజయ, పైపాడు మోహన్, జగన్మోహన్ నాయుడు, సంజీవ నాయుడు, కృష్ణయ్య, శేషు, సంజీవ్, పరమేష్, మరియు అల్లంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఐజ రాజోలి వడ్డేపల్లి ఇటిక్యాల మనోపాడు ఉండవెల్లి అల్లంపూర్ మండలాలలోని ఆయా గ్రామాల నుండి సుమారు 8వేల మంది వాల్మీకి సోదరులు పాల్గొన్నారు.


Similar News