నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రారంభమైన గ్రూప్-2 పరీక్షలు

నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రూప్ -2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 9731 మంది అభ్యర్థులకు గాను 32 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు.

Update: 2024-12-15 06:13 GMT

దిశ నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రూప్ -2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 9731 మంది అభ్యర్థులకు గాను 32 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుండి 12.30లకు, మధ్యాహ్నం 3 నుంచి .5.30 వరకు పరీక్షలు ఉంటాయి అని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30 కి పరీక్ష కేంద్రాలకు రావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదని ముందే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పలు సెంటర్ల వద్ద ఆలస్యంగా వచ్చిన సుమారు 19 మంది అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో గేట్ల ముందు అభ్యర్థులు పడిగాపులు కాస్తూ నిలబడ్డారు. ఎంత ప్రాధేయపడినా లోపలికి అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.


Similar News