Gadwal MLA : భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది

నెట్టెంపాడు ప్రాజెక్టు భాగంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ కింద నీట

Update: 2024-09-11 13:30 GMT

దిశ, గట్టు : నెట్టెంపాడు ప్రాజెక్టు భాగంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ కింద నీట మునిగిన చిన్నోనిపల్లి గ్రామన్ని ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  అన్నారు.   బుధవారం జిల్లా కలెక్టర్ బిఎం. సంతోష్, ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి మండలపరిధిలోని చిన్నోనిపల్లి గ్రామాన్ని సందర్శించారు.జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షానికి ముంపుకు గురైన చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముంపుకు గురైన 250 మందికి రూ. 16,500/- చొప్పున నష్టపరిహారం వారం రోజులలో అందే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. నిర్వాసితులందరూ ఆర్ & ఆర్ సెంటర్ కు వెంటనే షిఫ్ట్ కావాలని సూచించారు. ఈ పునరావాస కేంద్రంలో పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని రెండు నెలలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ తదితర సదుపాయాలను రెండు రోజులలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రంలో కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి డబ్బులు విడుదల చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. పునరావాస కేంద్రంలో అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటుతో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహించి అందరికీ మెరుగైన గవ అందించడం జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలను ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామంలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామన్నారు. ఆర్ & ఆర్ సెంటర్ ను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టు కోసం గ్రామస్తులు త్యాగం చేయాల్సి ఉంటుందని, రాబోవు రోజులలో ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీరు అందించి పాలమూరు జిల్లాలో వలసలు నివారించి ఇతర రాష్ట్రాల నుంచి మన జిల్లాకు పనులకు వచ్చే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

చిన్నోని పల్లి ప్రాజెక్టు పనులు గతంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిందని, ముంపుకు గురైన కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యవసాయంపై ఆధారపడిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం తరఫున ఆదుకోవడం జరుగుతుందన్నారు. వచ్చే ఆరు నెలల్లో రావలసిన అన్ని ఫలాలు, ఇండ్లు, షిఫ్టింగ్ చార్జీలతో పాటు ఆర్థిక సాయం ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఆర్ & ఆర్ సెంటర్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందకూడదని, అధికారులందరూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామచందర్, ఇరిగేషన్ ఈ ఈ రహీముద్దీన్, ఎలక్ట్రిసిటీ ఎస్ ఇ భాస్కర్, మిషన్ భగీరథ ఈ ఈ శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ సరిత రాణి, ఎంపీడీవో చెన్నయ్య, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News