ఉచిత విద్యుత్తు ఇవ్వడంలో నా పాత్ర ఎంతో ఉంది.. మాజీ మంత్రి
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాను తప్ప అధికారం కోసం తాను ఏనాడు అమ్ముడు పోలేదని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు.
దిశ, వీపనగండ్ల : ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాను తప్ప అధికారం కోసం తాను ఏనాడు అమ్ముడు పోలేదని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. పల్లెపల్లెకు మన జూపల్లి కార్యక్రమంలో మండల పరిధిలోని తూముకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యుత్ బకాయిల పై పోరాటం చేశాను తప్ప అమ్ముడు పోలేదని ఆయన అన్నారు. అధికారంలో కన్న ప్రతిపక్షంలోనే ఎక్కువ కాలం పని చేశానని, ఆనాడు రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించడంలో తన పాత్ర ఎంతో ఉందని అన్నారు.
తుంకుంట గ్రామంలో కాల్వలలో నీళ్ళు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలనే కనీసం ఆలోచన కూడా చేయలేని ఎమ్మెల్యే బీరం అని విమర్శించారు. కేఎల్ఐ ద్వారా ఆయకట్టు పెంచి తుంకుంట గ్రామం వరకు సాగునీరు వచ్చేలా కృషి చేశానని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ద్వారా ప్రజలకు జరగబోయే లబ్ధి గురించి వివరించారు. తుంకుంట గ్రామంలో ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గ్రామం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డా. గోదల బీరయ్య యాదవ్, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు డా.ఇంద్రకంటి వెంకటేష్, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, నాయకులు వాల మదన్మోహన్ రావు, మౌలాలి, రఘునాథ్ రెడ్డి, పలుస రామన్ గౌడ్, రాంబాబు, మీసాల మోహన్, తదితరులు ఉన్నారు.