వీడెవడండీ బాబూ..పెట్రోల్ బంక్ దగ్గర ఆర్మీ ఫ్లెక్సీలు

ఓ పంచాయతీ కార్యదర్శి అచ్చంపేట పట్టణంలో పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు.

Update: 2024-10-19 10:06 GMT

దిశ, అచ్చంపేట : ఓ పంచాయతీ కార్యదర్శి అచ్చంపేట పట్టణంలో పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. యజమాని గతంలో ఆర్మీలో విధులు నిర్వహించేవాడు. దీంతో తన ఫోటోలను పెట్రోల్ ప్రారంభం సందర్భంగా..ఆర్మీ ఫోటో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమంటూ అచ్చంపేట పట్టణానికి చెందిన కాజా సయ్యద్దుద్దీన్ జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్, అచ్చంపేట మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి తన విధులకు గైరాజరవుతూ పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం అధిక సమయం కేటాయిస్తున్నాడని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ వారు పోలే శ్రీనివాసులు తెలకపల్లి మండలం నెల్లికుదురు గ్రామ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి సునీత పేరున అచ్చంపేట పట్టణంలో ఆయిల్ కంపెనీ వారు మంజూరు చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద మిల్ట్రీ ఫిల్లింగ్ స్టేషన్ అని వ్యాపారం నిర్వహించడం తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ 1964 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాజా సయ్యద్దుద్దీన్ అధికారులకు ఫిర్యాదు చేసిన పత్రంలో పేర్కొన్నాడు. భారత చట్టం ప్రకారం 20 (1)ఏ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి తమ విధుల సమయంలో ఏదైనా వ్యాపారం ఇతర వ్యాపారాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని ఆ చట్టం తెలుపుతుందన్నారు. సదరు పంచాయతీ కార్యదర్శి పోలే శ్రీనివాసులు బిల్లింగ్ స్టేషన్ ముందు ఆర్మీ డ్రస్సులో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.. జాతీయ సాయిదా బలగాల అవమానపరిచేలా ఉండడం అంతమాత్రమే కాకుండా, తెలంగాణ పౌర సేవల కండక్టర్ రూల్స్ 1964 ను ఉల్లంఘించినందుకు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశాడు.

కార్యదర్శి పోలె శ్రీనివాసులు వివరణ..

అచ్చంపేట పట్టణంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ వద్ద పంచాయతీ కార్యదర్శి పోలే శ్రీనివాసులను ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం కాదా..? అని దిశ ప్రతినిధి వివరణ అడిగాడు. అప్పుడు పెట్రోల్ బంక్ యజమాని ఇలా సమాధానం ఇచ్చాడు..దేశ సైనికుల పట్ల గౌరవంతో ఆర్మీ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశానన్నారు. తెలియక జరిగిందని పెట్రోల్ బంక్ యజమాని తెలిపారు. అలాగే తను కార్యదర్శిగా విధులకు ప్రతిరోజు హాజరవుతున్నానని వివరణ ఇచ్చాడు. డ్యూటీ అనంతరం సెలవు దినాలలో నా సొంత పనులు చూసుకుంటున్నానని, కావాలని ఆ వ్యక్తి తనపై కంప్లీట్ చేశాడని ఆయన తెలిపారు.


Similar News