సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి: సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గుండె పోటు మరణాలను తగ్గించేందుకు గానూ వైద్య సిబ్బందికి కలెక్టరేట్ సమావేశ హాల్ లో బుధవారం శిక్షణ ఇప్పించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, జడ్పీ చైర్ పర్సన్ వనజ, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుండె పోటుకు గురైన వారికీ సీపీఆర్ చికిత్స చేస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చన్నారు. ప్రస్తుత సమాజంలో మారిన ఆహార అలవాట్లు, జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యతో ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారని చెప్పారు.
గుండెపోటు మరణాలను తగ్గించేందుకు జిల్లాలో విడతల వారీగా వైద్య అరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర విభాగాలైన మెడికల్, పోలీస్, మున్సిపల్, శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి, ఆ తర్వాత విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికేట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ యన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ హరి నారాయణ్ భట్టడ్, జడ్పీటీసీ అంజలి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.