MLA : మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసమే ఉచిత చేప పిల్లల పంపిణీ
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేప పిల్లల పెంపకం పై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.
దిశ, చిన్న చింతకుంట : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేప పిల్లల పెంపకం పై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలంలోని పర్దిపూర్ గ్రామంలోని రిజర్వాయర్ లో మత్స్య శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి 60 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గంలోని చెరువులలో ఉచితంగా చేపలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికోసం 42 లక్షల చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంచామని నేడు పర్దిపూర్ రిజర్వాయర్ లో 60 వేల చేప పిల్లలను వదిలామని, త్వరలో కోయిల్ సాగర్ లో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆలస్యం అయ్యింది అన్నారు. ఆలస్యం అయిన కూడా చేపలు పెరిగి మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉందని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, మీరందరూ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని మత్స్యకారులను కోరారు.
గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన… కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. ఫర్దిపూర్ గ్రామంలో కొన్నేళ్లు పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ముదిరాజ్ సోదరుల విజ్ఞప్తి మేరకు ముదిరాజ్ కమ్యూనిటీ భవన కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధుల నుండి రెండు లక్షల రూపాయలను తక్షణం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, మత్స్య శాఖ ఏడి రాధా రోహిణి, దేవరకద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ కథలప్ప, సింగల్ విండో చైర్మన్ లు ఉమామహేశ్వర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, వెంకటేష్, సంఘం అధ్యక్షుడు కేశవులు, కార్యదర్శి భాస్కర్ వెంకటేష్, శివకుమార్, వెంకటేష్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.