అన్ని వర్గాల అభివృద్ధి యే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్లే లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమలను నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ శాంత కుమారి రవీందర్,ఎంపీపీ రాధా జంగయ్య, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి తో కలిసి శంకుస్థాపనలు చేసి ప్రారంభం చేశారు

Update: 2023-10-08 14:33 GMT

దిశ,ఊర్కొండ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమలను నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ శాంత కుమారి రవీందర్,ఎంపీపీ రాధా జంగయ్య, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి తో కలిసి శంకుస్థాపనలు చేసి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన బొమ్మ రాసి పల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి,జగ బోయినపల్లి గ్రామంలోనూతనంగా నిర్మించబోయే ముదిరాజ్ భవనానికి శంకుస్థాపన తో పాటు యాదవ సంఘం భవనం గ్రామంలోని పలు సీసీ రోడ్లను ప్రారంభించారు.

ముచ్చర్ల పల్లి గ్రామంలో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హల్ భవనాన్ని ప్రారంభించారు. ఊర్కొండ మండల కేంద్రంలో 1500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మించిన గోదామును సింగిల్ విండో చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజయ్య,కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు .పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు, హామీలు ఇచ్చి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అందుకే మనం ప్రభుత్వనికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

రాష్టంలో అన్ని వర్గాల వారికీ ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్, ఎంపీ ఓ వెంకటేష్, పిఆర్ ఏఈ ఉపేందర్, కో ఆప్షన్ కళింపాషా, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వీరారెడ్డి నాయకులు జనార్దన్ రెడ్డి, గిరి నాయక్, జంగయ్య,శ్రీధర్ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి, యూత్ వింగ్ అధ్యక్షులు శేఖర్ యాదవ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దుబ్బ రవి, మాజీ సర్పంచులు శ్రీనివాసులు,కృష్ణ గౌడ్, యువ నాయకులు కొమ్ము శ్రీను, సందీప్, గోపి,మల్లేష్,సిద్దు, రేపని, శ్రీను,అక్బర్, మండల ప్రజా ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News