Devarakadra MLA : 48 గంటల్లోనే రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు..

వరి ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాలో ప్రభుత్వం

Update: 2024-10-26 11:48 GMT

దిశ, చిన్నచింతకుంట : వరి ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (MLA Madhusudhan Reddy ) అన్నారు. శనివారం మండలంలోని నెల్లికొండి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ (Congress party) రైతుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సన్న వడ్లకు రూ. 500 అదనపు బోనస్ ఇస్తామన్నారు. ఏ వన్ గ్రేడ్ క్వింటాలుకు రూ. 2320, సన్న వడ్లకు రూ. 2820 మద్దతు ధర ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ చైర్మన్ కథలప్ప తహసీల్దార్ ఎల్లన్న, సింగిల్ విండో చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేష్, వట్టెం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News