రహదారి పై పొంచి ఉన్న ప్రమాదం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ గ్రామ

Update: 2024-08-30 07:19 GMT

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సీఎం రావు ఫంక్షన్ హాల్ సమీపంలో ఖానాపూర్ నుండి జగిత్యాల జిల్లా కు వెళ్లే రహదారి పక్కన పాత మట్టి గోడపై చెట్టు కొమ్మ విరిగి పడి నెలలు గడుస్తుంది. విరిగిపడ్డ చెట్టు కొమ్మ ఆ గోడపై వుండడంతో వర్షలకు గోడలు తడిసి కులే ప్రమాదం వుంది.ఫంక్షన్ హాల్ పక్కన వ్యాపార సముదాయాలు వుండడంతో ప్రతి రోజు భారీగా జనసంచారం ఉంటుంది. అంతే కాకుండా ఈ రహదారి పై ప్రతి రోజు వేలాది వాహనాలు, ప్రయాణికులు వెళ్తూ ఉంటారు.ప్రభుత్వం రోడ్డు పక్కన ఉన్న ప్రమాదానికి పొంచివున్న చెట్లను ,గుంతలు తొలగించాలని ఆదేశాలు ఉన్న రోడ్డు పక్కన పాత మట్టి గోడపై చెట్టు కొమ్మ విరిగి పడి ఉన్న పట్టించుకోకుండా ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

ఆర్ అండ్ బి అధికారులు గాని, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఖానాపూర్ టు మెటపల్లి వెళ్లే రహదారి పక్కనే ఉండడం గమనార్హం. గ్రామంలో,పట్టణంలో పాత మట్టి గోడలతో ఉంటే తొలగిస్తారు.కానీ జనసంచారం ఉన్న ప్రదేశం, వేలాది వాహనాలు నడుస్తున్న రహదారి పక్కన ప్రమాదానికి పొంచివున్న చెట్లను,పాత మట్టి గోడలను తొలిగించకపోవడం ఏంటి అని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ప్రమాదానికి పొంచివున్న చెట్లను, చెట్టు కొమ్మను తొలిగించాలని పలువురు కోరుతున్నారు.


Similar News