రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దే అధికారం - మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Update: 2023-10-08 12:36 GMT

దిశ,మహబూబ్ నగర్: రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటి పథకాల గురించి ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని,రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయ్యిందని,ఎన్నికలు సమీపిస్తున్న వేళ అబద్ధపు హామీలను గుప్పిస్తుందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందంటే వాటిని అమలు పరచి,అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.ఇప్పటికే కర్ణాటక,హిమాచల్ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు.తమ ఓటును కాంగ్రెస్ పార్టీకే వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్,జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్,డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ ఫక్రు ఖురేషి,అష్షు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News