కాంగ్రెస్, బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి – కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ తేజస్విని గౌడ

తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో బీ ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని, బీజేపీ ఎమ్మెల్సీ తేజస్విని గౌడ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం ఎమ్యేల్యే ప్రవాస్ యోజన లో భాగంగా రాఘవేంద్ర కళ్యాణ మంటపం లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

Update: 2023-08-23 09:28 GMT

దిశ, కొత్తకోట: తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో బీ ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని, బీజేపీ ఎమ్మెల్సీ తేజస్విని గౌడ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం ఎమ్యేల్యే ప్రవాస్ యోజన లో భాగంగా రాఘవేంద్ర కళ్యాణ మంటపం లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులకు ఓట్లు కొనడం ప్రారంభించారనీ, అదే అలవాటు కర్ణాటకలో కూడా అలవాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యకర్తలు శ్రమిస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రతి కార్యకర్త ఇల్లిల్లు తిరిగి నరేంద్ర మోడీ ప్రజలకు చేస్తున్న పథకాలు ప్రచారం చేసి ఓట్లు రాబట్టాలని కోరారు. ఒకప్పుడు ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీ ఇప్పుడు మూడు వందలకు పైగా సీట్లు సాధించి రెండు సార్లు అధికారం లోకి వచ్చామని ఆమె తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా ఈ మూడు నెలలు కష్టపడితే బీజేపీని అధికారంలోకి తేవోచ్చని తేజస్విని గౌడ అన్నారు.

బీజేపీ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలు ముఖ్యమని వారిని తప్పకుండా కలవాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డోకుర్ పవన్ కుమార్ రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలమనెమ్మ, సుదర్శన్ రెడ్డి, ఎగ్గని నర్సింహులు, రాష్ట్ర నాయకులు కార్పొరేటర్ దేవరకద్ర బాలన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, రాష్ట్ర దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం, కొత్తకోట మండల అధ్యక్షులు కోటీశ్వర్ రెడ్డి, బీజేపీ కౌన్సిలర్ లు భరత్ భూషణ్,నవీన్ రెడ్డి, నారాయణమ్మ, మన్నెం యాదవ్,దాబశ్రీను,నరేందర్ గౌడ్,కొమ్ము సురేష్, రాఘవేంద్ర గౌడ్,బాలు, జిల్లా పలుధికారులు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల భూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News