ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
బాధితుల ఫిర్యాదుల పట్ల స్పందించి వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి పోలీస్ అధికారులకు ఆదేశించారు.
దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: బాధితుల ఫిర్యాదుల పట్ల స్పందించి వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ,సీఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల స్థితిని,పరిష్కారానికి తగు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా ఎలాంటి పైరవీలు లేకుండా,స్వచ్చందంగా పోలీస్ సేవలను వినియోగించుకుంటూ,వారి వారి సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా సహకరించాలని సూచిస్తూ,సంఘ వ్యతిరేక శక్తుల పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఆమె హెచ్చరించారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి పది మంది బాధితులు తమ ఫిర్యాదులను సమర్పించారు.