దిశ, మక్తల్: మక్తల్ మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్‌గా పావనిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ బుధవారం రోజు రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వులు జారీ కాగా గురువారం రోజు పావని బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడ పనిచేస్తున్న రాజయ్య కొన్ని వివాదాస్పదమైన పనులు పర్మిషన్లు ఇచ్చిన విషయం భయటకుపోక్కి పైఅదికారులకు ఫిర్యాదులు వేళ్ళాయి. దాంతో ఆయన్ను హేడ్ ఆఫీస్ హైదరాబాద్ మున్సిపల్ కమిష్నరేట్‌కు సరెండర్ చేసినట్టు సమాచారం. ఆఫీస్ వర్గాల కథనం ప్రకారం.. మక్తల్ మున్సిపాలిటీలో ప్రజలు ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్లకు దరఖాస్తు చేసుకోగా వాటిని నిబంధనల ప్రకారం స్థానిక డిప్యూటీ తాహసీల్దార్ పరిశీలించి ఓకే చేయాలి.
అప్పుడు మున్సిపల్ వారు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ మంజూరి చేయాలి. కానీ అసంపూర్తిగా, వివాదస్పదంగా ఉన్న వాటిని డిప్యూటీ తహసీల్దార్ తిరస్కరించారు. ఆ ధరఖాస్తులు తిరస్కరించిన యజమానులతో రాజయ్య కమిట్ కలిసి అక్రమంగా దాదాపు ముప్పై ధరఖాస్తులకు ఓకే చేయడం జరిగిందని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ రాజయ్యను హెడ్ ఆఫీస్‌కు సరెండర్ చేస్తూ, మక్తల్‌లో ఎంపీడీవోగా పనిచేసిన పావనిని ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తున్నట్ల ఉత్తర్వులు జారీ అయ్యాయి, కాగా నేడు పావని పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం.