మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

తమ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని,ఆరు గ్యారేంటీల్లో మహిళలకే పెద్ద పీట వేశామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు

Update: 2024-12-29 16:28 GMT

 దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: తమ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని,ఆరు గ్యారేంటీల్లో మహిళలకే పెద్ద పీట వేశామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన మహిళలకు ఆయన కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళ సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తుందని,అందులో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణంతో పాటు..500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని,త్వరలో ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరునే వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,వైస్ చైర్మెన్ షబ్బీర్ అహ్మద్,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహ్మారెడ్డి,ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత,అవేజ్,అజ్మత్ అలి,వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి...

మంచి లక్ష్యాన్ని ఎంచుకొని,అందుకు అనుగుణంగా కష్టపడి చదువుకుని,ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడుగగా..హాస్టల్ లో గ్రంథాలయం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ కుమార్,సుధాకర్ రెడ్డి,ప్రవీణ్ కుమార్,రవి,వార్డెన్ స్వప్న,రాణి,క్రిష్ణమోహన్ పాల్గొన్నారు.


Similar News