ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగంగా పూర్తి చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు.

Update: 2024-12-29 14:31 GMT

దిశ, మరికల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు. ఆదివారం మరికల్ మండలంలోని అప్పంపల్లి, మరికల్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బందితో మాట్లాడారు. మండలం మొత్తానికి సర్వే ఎంత శాతం నమోదైందని కలెక్టర్ ప్రశ్నించగా..61శాతం నమోదు అయినట్లు ఎంపీడీఓ కొండన్న కలెక్టర్ కు తెలిపారు. సర్వేను ఈ రెండు రోజుల్లో ఇంకా వేగంగా చేపట్టాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. అనంతరం కలెక్టర్ మరికల్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీకి వెళ్లి అక్కడ జరుగుతున్న సర్వే తీరును పరిశీలించారు. యాప్ లో ఏమైనా సమస్యలు వస్తున్నాయా ? అని అడిగారు. యాప్ లోని కాలాంశాల ప్రకారం వివరాలను నమోదు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరు నాటికి వంద శాతం సర్వే పూర్తి కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సిఈఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


Similar News