మొలకెత్తిన ధాన్యం ప్రభుత్వం కొనాలి : మాజీ మంత్రి చిన్నారెడ్డి
మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.
దిశ, గోపాలపేట : మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం గోపాలపేట మండలంలోని పలుగ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి చిన్నారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. అధికారులు హమాలీలతో సమన్వయం లేకపోవడం పట్ల ఇష్టానుసారంగా ఉండడంతో ధాన్యం కొనుగోలు చేసుకోలేకపోయారు. ఇది ఇలా ఉండగా తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు కేంద్రాల వద్దకు రైతులు తీసుకెళ్లిన ధాన్యం తడిసి ముద్దయింది.
ధాన్యం మొలకెత్తాయి. మొలకెత్తిన ధాన్యం తాము కొనుగోలు చేసుకోలేమని అధికారులు రైతులకు తెలిపారు. దీంతో రైతులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తడిసిపోయిందని ప్రభుత్వమే భరించాలని రైతులు ఆగ్రహించారు. దీంతో అఖిలపక్ష నాయకులు మాజీమంత్రి చిన్నారెడ్డి కేంద్రాల వద్దకు వెళ్లి అధికారులను నిలదీశారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే వర్షానికి దాన్యం తడిసిందని ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని తప్పకుండా రైతులకు న్యాయం జరిగేలా మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు నాయకులు ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.