అమ్మమ్మ మరణంతో అనాథలైన చిన్నారులు
అమ్మమ్మ మరణంతో ఇద్దరు చిన్నారులు అనాథలు అయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం
దిశ, అలంపూర్ టౌన్: అమ్మమ్మ మరణంతో ఇద్దరు చిన్నారులు అనాథలు అయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం… జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం శాంతినగర్ లో జయమ్మ కూతురు కృష్ణవేణికి ఉదయ్ కౌసిక్ (11)భానుప్రకాష్(10)ఇద్దరు కుమారులు పిల్లల చిన్నతనంలోనే భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి పిల్లలతో తల్లి జయమ్మ దగ్గర ఉంటుంది. తమకున్న స్థలంలో సెటర్లు నిర్మించారు.
సెటర్ల నిర్మాణం కోసం అప్పులు ఇచ్చిన వారికి అధిక వడ్డీలతో చెల్లించిన ఇంకా అప్పు కట్టాలని అప్పుల వాళ్ళు వేధించడంతో మానసికంగా కృంగిపోయి హార్ట్ ఎటాక్ తో మరణించింది. తల్లి మరణించడంతో చిన్నారులు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. తీరా ఇప్పుడు అమ్మమ్మ మరణించడంతో ఇద్దరు చిన్నారులు దిక్కులేని అనాథలుగా మిగిలారు. చూడడానికి ఆస్తి ఉన్న అది కొంతమంది స్వార్ధ పరుల చేతిలో ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వారి చెర నుంచి ఆస్తిని విడిపించి చిన్నారులకు జీవనాధారం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.