తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర కీలకం

తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశేషమైనదని, ఆమె చైతన్యం, శక్తికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

Update: 2024-09-26 09:56 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశేషమైనదని, ఆమె చైతన్యం, శక్తికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీఓసీ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి, శ్రామిక పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారని కొనియాడారు.

    ఆమె పోరాటం కేవలం వ్యక్తిగతంగా సాధించిన విజయం మాత్రమే కాకుండా, సమాజంలో అణగారిన వర్గాలకి ఒక గొప్ప ప్రేరణగా నిలిచిందని అన్నారు. తెలంగాణ సమాజంలో విశేషంగా నిలిచిందని, తన ధైర్యంతో మహిళకు మార్గదర్శకంగా నిలిచారని, ఆమె చూపిన ధైర్యసాహసాలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో మహిళా చైతన్యాన్ని, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పునరుద్ధరించడంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. నేటి తరానికి ఆమె చూపిన మార్గం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వీరభద్రప్ప, జెడ్పీ సీఈఓ కాంతమ్మ, ఇన్​చార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి సరోజమ్మ, అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News