ఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ ఆచూకీ: ఎస్పీ నరసింహ

పోగొట్టుకున్న సెల్ ఫోన్ ఆచూకీ తెలిపే 'సిఈఐఆర్ పోర్టల్' ఇన్ స్టాల్ చేసిన 4వ రోజే మొదటి కేసును పోర్టల్ ద్వారా పరిశోధించి పోయిన సెల్ ఫోన్ ను తిరిగి కనుగొన్నామని జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు.

Update: 2023-04-19 17:21 GMT

దిశ, మహబూబ్ నగర్: పోగొట్టుకున్న సెల్ ఫోన్ ఆచూకీ తెలిపే 'సిఈఐఆర్ పోర్టల్' ఇన్ స్టాల్ చేసిన 4వ రోజే మొదటి కేసును పోర్టల్ ద్వారా పరిశోధించి పోయిన సెల్ ఫోన్ ను తిరిగి కనుగొన్నామని జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి తన రూ. 45 వేల విలువైన 'వన్ ప్లస్' మొబైల్ పోగొట్టుకొని, పోర్టల్ గురించి తెలుసుకొని, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సెల్ ఇంచార్జీ రాఘవేందర్ కు సమాచారం అందించాడని ఆయన తెలిపారు. వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా లోకేషన్ గుర్తించి సంబంధిత ఫిర్యాదుదారుడికి అందజేశామని ఎస్పీ తెలిపారు. విలువైన ఫోన్ ను పోగొట్టుకొంటే సంబంధిత వివరాలతో ఏరియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఎస్పీ వెంట డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి ఐటీ సెల్ ఇంచార్జి ఎస్ఐ రాఘవేందర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News